తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలు | After volatile session Sensex tumbles 581points | Sakshi
Sakshi News home page

తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలు

Mar 19 2020 3:50 PM | Updated on Mar 19 2020 4:00 PM

After volatile session Sensex tumbles 581points - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరికి భారీ నష్టాలతో ముగిసాయి.  కోవిడ్‌-19 ప్రభావంతో వరుసగా కుదేలవుతున్న కీలక సూచీలు గురువారం కూడా అదే బాటలో పయనించాయి. ఆరంభ నష్టాలనుంచి  కోలుకుని మిడ్‌సెషన్‌లో కనిష్టం నుంచి సెన్సెక్స్‌ 2650 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 2100  పాయింట్లు ఎగిసాయి. కానీ డెరివేటివ్‌ కౌంటర్‌ ముగింపు నేపథ్యంలో తిరిగి అమ్మకాలు భారీగా నెలకొన్నాయి. దీంతో  సెన్సెక్స్‌ 581 పాయింట్లు, నిఫ్టీ 199   పాయింట్లు నష్టంతో ముగిసాయి.   దీంతో సెన్సెక్స్‌ 28500, నిఫ్టీ 8500 పాయింట్లను నిలబెట్టుకోలేక పోయాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఫైనాన్షియల్ స్టాక్స్ నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ కూడా 5.3 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.5 శాతం,  ఐటి 3 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.6 శాతం క్షీణించాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ ఆర్‌ఐఎల్, ఎల్ అండ్ టీ  మారుతి సుజుకి భారీగా నష్టపోయాయి.  ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌,  ఇన్ఫోసిస్‌, హీరో మోటో, ఐవోసీ లాభపడ్డాయి.  మరోవైపు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఆల్‌ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement