కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ, మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య సంయుక్తం ఆధ్వర్యంలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ, మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య సంయుక్తం ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో జాతీయ విక్రేత అభివృద్ధి ప్రదర్శన (నేషనల్ వెండర్ డెవలప్‌మెంట్ ఎగ్జిబిషన్) జరగనుంది. కుషాయిగూడలోని ఎన్‌ఎస్‌ఐసీ బిజినెస్ పార్క్ ఈ ప్రదర్శన జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దక్షిణ మధ్య రైల్వే, విశాఖ స్టీల్ ప్లాంట్, బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఎండీసీ, ఎన్‌జీసీ, బీడీఎల్, గెయిల్, ఎన్‌టీపీసీ వంటి సుమారు 200లకు పైగా ప్రభుత్వం సంస్థలు పాల్గొంటాయి.