జగనన్నకు పట్టం కడదాం | YSRCP Ravali Jagan Kavali Jagan in PSR Nellore Anil Kumar Yadav | Sakshi
Sakshi News home page

జగనన్నకు పట్టం కడదాం

Feb 25 2019 12:30 PM | Updated on Feb 25 2019 12:30 PM

YSRCP Ravali Jagan Kavali Jagan in PSR Nellore Anil Kumar Yadav  - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్ర ప్రజల కోసం పదేళ్ల నుంచి పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో పట్టం కడదామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. మూడో డివిజన్‌కు చెందిన మిట్టా ధనుంజయ, వసంత్‌కుమార్, 52వ డివిజన్‌కు చెందిన పఠాన్‌ షఫీఖాన్‌ వారి మిత్ర బృందం దాదాపు 200 మంది ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదేళ్ల నుంచి ప్రజల కోసం పోరాటాలు చేస్తూ వారి మధ్యలో తిరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమిస్తే మంచి రోజులు వస్తాయన్నారు.

వైఎస్సార్‌ సువర్ణయుగం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి నారాయణ ఏ రోజూ ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుంది లేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు ఏమి కావాలో అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఏ ఒక్క విద్యార్థికీ, అదే విధంగా నారాయణ వైద్యశాలలో పేదలకు ఉచితంగా చికిత్స చేసిన దాఖలాల్లేవని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్లు, నగరంలో ఏర్పాటు చేస్తున్న పార్కుల్లో నారాయణ, టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజల మనిషినని, తనను ప్రజలు నేరుగా కలిసే వీలుందన్నారు. లేకపోతే తానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. మూడో డివిజన్‌ నుంచి సోము, రమణ, శ్రీహరి, సతీష్, నాగరాజు, రాజేంద్ర, రత్తయ్య, వినోద్, 52వ డివిజన్‌ నుంచి లియాఖత్, ఫైరోజ్, రహంతుల్లా, సమీర్, షోయబ్, ముసార్, ముస్తాక్, అతహర్, మన్సూర్, తదితరులు పార్టీలో చేరారు. పార్టీ నాయకులు సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఈదల ధనూజరెడ్డి, మల్లికార్జున్, భాస్కర్‌రెడ్డి, నాగరాజు, పఠాన్‌ ఫయాజ్‌ ఖాన్, కొణిదల సుధీర్, హంజాహుస్సేనీ, రంగా, షాబుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement