5వ తేదీ ధర్నాలో అందరూ పాల్గొనండి: వైఎస్ జగన్ | YSRCP protest for cyclone relief, loan waiver on November 5, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

5వ తేదీ ధర్నాలో అందరూ పాల్గొనండి: వైఎస్ జగన్

Nov 4 2014 1:14 PM | Updated on Jul 6 2019 1:10 PM

నవంబర్ 5వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరారు.

హైదరాబాద్ : నవంబర్ 5వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరారు. ఆయన మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు హామీల వైఫల్యంపై ఆయన ఏమన్నారంటే..

* చంద్రబాబు తన పథకాల గురించి గ్రామాల్లో పెద్దపెద్ద హోర్డింగులు పెట్టారు. లైట్లు కూడా పెట్టారు. ఎక్కడైనా కనపడకుండా పోతుందేమోనని, అందరూ చూడాలని భారీ ప్రచారాలు చేసుకున్నారు.
* ప్రతి ఒక్క ప్రకటనా చివరకు కార్యకర్తలకు ఇంటింటికీ వెళ్లి పాంప్లెట్లు కూడా పంచారు.
* అధికారంలోకి వస్తూనే దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలని, రుణమాఫీపై మొట్టమొదటి సంతకం చేస్తానని అన్నారు.
* ప్రతి కుటుంబం బాగుంటాలంటే అక్కచెల్లెళ్లు బాగుండాలి, అందుకే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.
* జాబు కావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం, ఉపాధి కల్పిస్తాను. అది దొరకనంత వరకు నెలకు 2వేల రూపాయలు ఇస్తానన్నారు. ఇలా హామీలు గుప్పించి ప్రజలను వంచించారు.

* ఎన్ని వ్యవసాయ రుణాలున్నాయని బ్యాంకర్ల కమిటీ సమావేశంలో అడిగారు. బ్యాంకర్లు అన్ని వివరాలూ ఇచ్చారు. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, 14వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. రెండూ కలిపితే లక్ష కోట్లకు పైగా ఉన్నాయి.
* వీటిపై చంద్రబాబు మాటలు నమ్మి, ఆయన కట్టొద్దంటే కట్టకుండా ఉన్నందుకు వీటిమీద 14వేల కోట్ల అపరాధ వడ్డీ పడింది. దీన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.

* చంద్రబాబు చేసిన బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు కాబట్టి, ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి మరో 14వేల కోట్ల వడ్డీ భారం పడుతుంది. మొత్తం కలిపి 28వేల కోట్లు వడ్డీలే అవుతుంటే.. చంద్రబాబు కేవలం 5వేల కోట్లే కేటాయించి చేతులు దులుపుకొన్నారు.
* 20 శాతం రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికీ చెబుతున్నారు. రైతులను ఎంతగా మోసం చేస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం.
* చంద్రబాబు చెప్పారు కాబట్టి రుణాలు కట్టకపోవడంతో అవి రెన్యువల్ కాలేదు. దాంతో హుదూద్ తుఫాను వల్ల కలిగిన పంట నష్టానికి కనీసం బీమా కూడా రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement