కేంద్ర ఆర్థిక మంత్రికి ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ

YSRCP MP Balashowry Write A letter To Nirmala Sitharaman On Income Tax - Sakshi

సాక్షి, అమరావతి : ఆదాయ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గిస్తే ప్రజల ఆర్థిక లావాదేవీలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. 

ఇటీవల జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో భారతదేశం వ్యాపారరంగాన్ని మరింత అభివృద్ధి పరచే దిశలో భాగంగా  విదేశీ పెట్టుబడిదారులకు వాణిజ్యపన్నుశాతాన్ని5కు (DA )తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం చాలా మంచింది. దీని వలన ఒక కోటి కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులు లబ్ధిపొందుతారు. వివిధ వ్యాపార సంస్థలలో పెట్టుబడులకు అనేకమంది ఆసక్తి కనపరుస్తారు.  దాదాపు రెండు కోట్ల మందికి ఆర్ధికకార్యకలాపాలలో పాలుపొందే వీలుంటుంది. కేంద్రం తీసుకున్నీ  నిర్ణయం దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. అలాగే ఈ ఆర్థిక సవంత్సరానికిగాను వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు విషయమై జూన్‌ మాసంలోనే కేంద్రం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని ప్రజలంతా ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గిస్తే లావాదేవీలు పెరుతుతాయి. ఈ పండుగ మాసంలో ప్రజలందరూ జరిపే ఆర్థికలావాదేవీలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నాను’  అని బాలశౌరి లేఖలో పేర్కొన్నారు. 

అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరానికిగాను వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు విషయమై జూన్ మాసంలోనే కేంద్రం నుండి ఏదైనా ప్రకటన వస్తుంది అని భారతదేశ ప్రజలందరూ ఎదురుచూసి నిరాశకుగురిఅయ్యారు అని ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు శాతాన్ని తగ్గించినయెడల ఈ పండుగమాసంలో ప్రజలందరూ జరిపే ఆర్థికలావాదేవీలు మరింత పెరుగుతాయి అని ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఒక  స్పష్టమైన ప్రకటన చేయవలసిందిగా లేఖలో బాలశౌరి కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top