కర్నూలు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్హౌస్లో కరువు బృందం సభ్యులను గురువారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుకలు కలిశారు.
కర్నూలు: అధికార పార్టీ నేతలు కరువు బృందాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుకలు మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం సరికాదన్నారు.
గురువారం కర్నూలు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్హౌస్లో కరువు బృందం సభ్యులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. కర్నూలు జిల్లాల్లో కరువు బృందం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పర్యటించిందని వారు విమర్శించారు. ఈ జిల్లాలో 20 మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.