కేంద్ర మంత్రులు, ఎంపీలు చవటలు: గురునాథరెడ్డి | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులు, ఎంపీలు చవటలు: గురునాథరెడ్డి

Published Sun, Oct 6 2013 5:56 PM

కేంద్ర మంత్రులు, ఎంపీలు చవటలు: గురునాథరెడ్డి - Sakshi

సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చవట దద్దమ్మలని, వారి చేతకానితనం వల్లనే తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. వారు ముందే మూకుమ్మడిగా రాజీనామాలు చేసింటే ఈ దుస్థితి ఏర్పడేది కా దని ఆవేదన వ్యక్తం చేశారు.
 
వైఎస్సా ర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 72 గంటల బంద్‌లో భాగంగా నిరసన కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు. రైల్‌ రోకో చేసి సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేశామన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధినేత రెండోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కుటిల రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఎక్కడ సీబీఐ ద్వారా కేసులు బనాయిస్తుందోనని వారి కాళ్లు పట్టుకుని విభజనకు మద్దతుగా లేఖ రాశారని దుయ్యబట్టారు. 
 

Advertisement
Advertisement