'టీడీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు' | ysrcp leaders fires on tdp government | Sakshi
Sakshi News home page

'టీడీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు'

Jun 26 2015 5:03 PM | Updated on Jun 1 2018 9:07 PM

'టీడీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు' - Sakshi

'టీడీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు'

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.. టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.. టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతికంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నైతిక విలువలకు ప్రాముఖ్యం ఇచ్చి మెజారిటీ ఉన్న చోటనే వైఎస్సార్సీపీ పోటీకి సిద్ధమైంది. అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్మును పెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది' అని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

ఉవరకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం లేదని సీఎం చంద్రబాబు తీరుతో మరోసారి రుజువైందన్నారు. టీడీపీ గెలవని జిల్లాలను  అభివృద్ధి చేసేది లేదంటూ అధికార పార్టీ నేతలే బహిరంగంగా చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement