జేసీ సోదరుల ప్రమేయంతోనే దాడులు | ysrcp leader vr ramireddy takes on jc brrothers | Sakshi
Sakshi News home page

జేసీ సోదరుల ప్రమేయంతోనే దాడులు

Oct 18 2014 10:31 PM | Updated on Aug 10 2018 8:08 PM

జేసీ సోదరులు అభివృద్ధిని పక్కనపెట్టి ఫ్యాక్సనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని రామిరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల ప్రమేయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ నేత వీఆర్ రామిరెడ్డి ఆరో్పించారు. జేసీ సోదరులు అభివృద్ధిని పక్కనపెట్టి ఫ్యాక్సనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని రామిరెడ్డి విమర్శించారు.

శనివారం తాడిపత్రి మండలం వీరాపురంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గతంలో పలుమార్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన టీడీపీ మరోమారు అదే దౌర్జన్యానికి ఒడిగట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement