టీడీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పేదలకు ఒక్క ఉపయోగ పడే పని చేయలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.
'ఒక్క హామీ నెరవేర్చని ఘనత బాబుదే'
Feb 15 2016 6:17 PM | Updated on Jul 28 2018 6:35 PM
గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పేదలకు ఒక్క ఉపయోగ పడే పని చేయలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క పేద వాడికి ఇళ్లు కట్టించిన దాఖలాలు కూడా లేవని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చని ఘనత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం టీడీపీ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా వారు పద్దతులు మార్చుకుని పరిపాలన పై దృష్టి పెట్టాలని అప్పిరెడ్డి సూచించారు.
Advertisement
Advertisement