వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం

వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం - Sakshi


హైదరాబాద్: మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ సిపికి గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో ఈ  గుర్తింపు తక్షణమే అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.వైఎస్ఆర్ సిపికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లభించే అన్ని అర్హతలు ఆ పార్టీకి లభించాయి. మునిసిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేసమయంలో ఈ పార్టీకి విప్ జారీ చేసే అధికారం కూడా లభించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top