పోలీసులపై కన్నబాబు ఆగ్రహం | ysrcp east godavari president kurasala kannababu takes on police over kakinada municipal poll | Sakshi
Sakshi News home page

పోలీసులపై కన్నబాబు ఆగ్రహం

Aug 29 2017 12:48 PM | Updated on Sep 17 2018 6:08 PM

పోలీసుల తీరుపై వైఎస్‌ఆర్‌ సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకినాడ: కాకినాడలో పోలీసుల తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలను బెదిరిస్తూ.. అధికార పార్టీ సభ్యులకు మద్దతు ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. దీంతో గుడారిగుంట 3వ డివిజన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాకినాడలో ప్రశాంతంగా ఓటింగ్‌ జరుగుతున్న క్రమంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. 14 డివిజన్‌లో ఒక పక్క పోలింగ్‌ జరుగుతుండగా, మరోపక్క టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ ప్రలోభాలను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement