డాక్టర్‌ దుట్టాకు వైఎస్సార్‌ కుటుంబం అరుదైన బహుమతి  

YSR Family gave a special Gift To Doctor Dutta Ramachandra Rao - Sakshi

మహానేత ధరించిన దుస్తులను పంపిన విజయమ్మ 

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌: కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావును వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైఎస్సార్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైఎస్‌ విజయమ్మ బహుమతిని పంపించారు.  వైఎస్సార్‌ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్‌ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్‌ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top