కారుమూరికి సముచిత స్థానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియమితులయ్యూరు. ఈ మేర కు పార్టీ అధిష్టానం
	 ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియమితులయ్యూరు. ఈ మేర కు పార్టీ అధిష్టానం శనివారం ఒక ప్రకటన చేసింది. గతంలో ద్వారకాతిరుమల జెడ్పీటీసీగా ఎన్నికైన ఆయన జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు విశేష సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు 2009 ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. ఈ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దెందులూరు నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీచేశారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలకమైన జనరల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించింది.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
