రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా? | YSR Congress Party Opposed to defence FDI limit in defence | Sakshi
Sakshi News home page

రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?

Jul 10 2014 4:33 PM | Updated on Oct 4 2018 5:15 PM

రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా? - Sakshi

రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులా?

రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యతిరేకించారు.

గుంటూరు: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యతిరేకించారు. రక్షణ శాఖలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు రక్షణ రంగంలో 49 శాతం వరకు ఎఫ్డీఐలు అనుమతించాలని గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది.

కాగా, బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రుణమాఫీ ప్రస్తావన రాలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఊసే లేదన్నారు. ఏపీలో రూ.15,900 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, దీని భర్తీ విషయంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు ప్రస్తావన రాలేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement