జిల్లా వ్యాప్తంగా సమైక్య దీక్షలు | ysr congress party leaders samaikya deeksha in srikakulam | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా సమైక్య దీక్షలు

Jan 8 2014 2:00 AM | Updated on Sep 2 2018 4:46 PM

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు మంగళవారం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేసి నరసన తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కదలివచ్చారు.
 
  శ్రీకాకుళం: తహశీల్దారు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యురాలు, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ప్రారంభించారు. సమైక్య నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మార్పు ధర్మారావు, అందవరపు సూరిబాబు, శ్రీనివాస్‌పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.   టెక్కలి: పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో టెక్కలి వైఎస్‌ఆర్ కూడలిలో రిలే దీక్షను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, తిర్లంగి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
 
   పలాస:  కాశీబుగ్గ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. నియోకజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావుతో పాటు నాయకులు డబ్బీరు భవానీశంకర్, బోనెల రాము, నర్తు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లోని మదర్‌థెరిసా కాన్సెప్ట్ స్కూల్, శ్రీ గురుకుల విద్యాలయం, విద్యావాహిని, షిర్డీసాయి డిగ్రీ కళాశాల, బీఈటీ స్కూల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
 
   ఇచ్ఛాపురం: నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లామహిళా కన్వీనర్ బి.హేమామాలిని రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ బల్లాడ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాతపట్నం: పాతపట్నం వైఎస్సార్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షను పార్టీ నాయకులు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ శిబిరాన్ని ప్రారంభించగా.. మండల యూత్ అధ్యక్షుడు బి.వసంతరావు, మండల కన్వీనర్ కె. అర్జునరావు పాల్గొన్నారు.  రాజాం: రాజాం వైఎస్సార్ విగ్రహ కూడలి వద్ద పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 
 
 కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
  ఆమదాలవలస: స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణంలో నిర్వహించిన  రిలే నిరాహారదీక్షలో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి తదితరులు పాల్గొన్నారు.   ఎచ్చెర్ల: రణస్థలం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు టంపాల సీతారాం పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement