సంకల్పం రాస్తున్న చరిత్ర

YS Jagan Praja Sankalpa Yatra Compleats 300 Days - Sakshi

ప్రజా సంకల్పయాత్రలో చారిత్రాత్మక ఘట్టాలకు వేదికైన విజయనగరం

జిల్లాలోనే జగన్‌ పాదయాత్ర  3 వేల కిలోమీటర్లు, 300 రోజుల పూర్తి

కురుపాం నియోజకవర్గం తోటపల్లి బ్యారేజీ వద్ద మొక్క నాటి, కేక్‌ కట్‌ చేసిన జననేత

జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తయిన పాదయాత్ర

కురుపాం నియోజకవర్గంలోకి  ప్రవేశించిన యాత్ర

ఘన స్వాగతం పలికిన కురుపాం ఎమ్మెల్యే, వేలాది ప్రజలు

మహానేత కలల ప్రాజెక్టు తోటపల్లి ప్రధానకట్టపై నడిచిన జననేత

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనం కోసం వేసిన తొలి అడుగు వేలాది కిలోమీటర్లు దాటినా అలసిపోనంటోంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చి వందల రోజులు గడిచిపోతున్నా ఆ అడుగు ముందుకే పడుతోంది. ఎందుకంటే ఆయన జగన్‌. జనం నుంచి.. జనం కోసం పుట్టిన నాయకుడై క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతున్న జననేత ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోనే వరుస రికార్డులను నమోదు చేసుకుం టోంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సం కల్పయాత్ర  ఆదివారం నాటికి 300 రోజులు పూ ర్తి చేసుకుని మరో కొత్త చరిత్రను నమోదు చేసుకుంది. జననేత కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో మూడొందల రోజుల ఘట్టా నికి గుర్తుగా మొక్క నాటి భారీ కేక్‌ను కట్‌ చేశారు.

అనేక మైలురాళ్లు దాటి...
వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే పలు మైలు రాళ్లను దాటింది. సెప్టెంబర్‌ 24న విజయనగరం జిల్లాలో అడుగిడిన రోజే ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. గుర్ల మండలం ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. తాజాగా ఆదివారం పాదయాత్ర ప్రారంభించి 300 రోజులు పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 124 నియోజకవర్గాలు, 8 కార్పొరేషన్‌లలో పర్యటించిన జగన్‌ 114 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు 42 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

కురుపాం నియోజకవర్గంలో ఘన స్వాగతం
పార్వతీపురం పట్టణ శివారుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర కోటవానివలస, బంటువాని వలస, అడ్డాపు శీల, బాచి జంక్షన్‌ మీదుగా సీతారామపురం క్రాస్‌ వద్దకు చేరుకుంది. అడ్డాపుశీల వద్ద సెలూన్‌ షాపును సందర్శించి నిర్వహణ లో కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానంతరం కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమా ర్తె శ్రావణితో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు జననేత జగన్‌కు ఘన స్వాగతం పలికారు. తమ ఆశల రేడు తమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్బంగా మందుగుండు సామాగ్రి పేల్చి సంబరాలు చేసుకున్నారు. పార్టీ రంగులతో సుందరంగా తీర్చిదిద్దన ఎండ్ల బండ్లతో రైతన్నలు ఆత్మీయ నేతకు సాదర స్వాగతం పలికారు. భోజన విరామ సమయంలో అరకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫల్గుణ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు వైఎస్‌జగన్‌ సమక్షంలో పార్టీలో చేరగా... రాత్రి బస వద్ద రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో టీడీపీ , కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలు వురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

కష్టాలు వింటూ.. భరోసా కల్పిస్తూ:
ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు పడుతున్న కష్టాలు వింటూ... వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. పాదయా త్ర ప్రారంభంలో రెల్లి కులస్థులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న తమను ఆదుకోవాలని, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ క్రమబద్ధీకరణకు నోచుకోకపోగా.. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాదయాత్రలో పార్టీ నాయకులు:
పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం,  కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, పార్వతీపురం, నెల్లిమర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు అలజంగి జోగారావు, పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, యువజన నేత ఈశ్వర్‌ కౌశిక్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాలపద్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, నెల్లిమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసినాయు డు, చిత్తూరు జిల్లా నాయకురాలు సామాన్య కిరణ్, రాజమండ్రి అర్బన్‌ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రా జు, కొవ్వూరు కో ఆర్డినేటర్‌ తానేటివనతి, గోపాలపురం కో ఆర్డినేటర్‌ వెంకటరావు, అనపర్తి కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, కొవ్వూరు పట్టణ పార్టీ అధ్యక్షులు రుత్తల ఉదయ్‌భాస్కరరావు  తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లి ప్రాజెక్టు కుడిప్రధాన కట్టపై యాత్ర
మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్న తోటపల్లి ప్రాజెక్టును ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి  ఆదివారం తనివితీరా పరిశీలించారు. పాదయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గం చేరుకున్న ఆయన  సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్టు కుడి ప్రధాన కట్టపై పాదయాత్ర చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యంతో పాటు విడుదలవుతున్న నీటిద్వారా సాగవుతున్న విస్తీర్ణం వివరాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రిజర్వాయర్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్లీలతో బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెలూన్‌ దీపాలు, బాణా సంచా వెలుగులతో ఆ ప్రాంతం పండగను తలపించింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని ఆదివారం మధ్యాహ్న భోజన విరామానంతరం కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top