తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి | ys jagan mohanreddy conveyed greetings on the festive occasion of sankranti | Sakshi
Sakshi News home page

తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి

Published Thu, Jan 14 2016 2:16 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి - Sakshi

తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి

ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని ఆయన అన్నారు.

పాడిపంటలతో, పైరుపచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నానని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement