
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు.
కాణిపాకం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్తో పాటు స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు.