చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రమాదం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Tweet On Somayajulu Report | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రమాదం : వైఎస్‌ జగన్‌

Sep 19 2018 9:22 PM | Updated on Sep 19 2018 9:27 PM

YS Jagan Mohan Reddy Tweet On Somayajulu Report - Sakshi

చంద్రబాబు చేతిలో ఉన్న కమిషన్‌తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని...

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఉన్న కమిషన్‌తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని జగన్‌ మండిపడ్డారు. కాగా పుష్కరాల సమయంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద జరిగిన తొక్కిసలాటకు ముహూర్త కాలంపై జరిగిన ప్రచారమేనని సోమయాజుల కమిషన్‌ బుధవారం నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనిపై వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే.. దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవడం మరో తప్పని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పుల మీద తప్పులు చేశారని.. చంద్రబాబు చర్యల వల్లనే అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైఎస్‌ జగన్‌  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement