జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు పనులు మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయకట్టు పరిధిలో ఫీడ ర్ చానెల్స్, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కా ల్వ లు, ప్రధానకాల్వల వెంట పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది.
గద్వాల, న్యూస్‌లైన్:
జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు పనులు మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయకట్టు పరిధిలో ఫీడ ర్ చానెల్స్, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కా ల్వ లు, ప్రధానకాల్వల వెంట పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. నిధుల కేటాయిం పులో పాలకుల అలసత్వం.. పనులు చే పట్టడంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణం గా ఆయకట్టుకు సకాలంలో సాగునీ టిని అం దించలేకపోతున్నారు. ఇలా సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఏటా న ష్టపోతూనే ఉన్నారు. జిల్లాలోని ఐదు ని యోజకవర్గాల పరిధిలో 1.07లక్షల ఎకరాలకు సా గునీటిని అందించాలనే లక్ష్యం తో 33 ఏళ్ల క్రితం ప్రారంభించిన జూరాల ను 1996 ఆగస్టు 5న జాతికి అంకితం చే శారు. కాగా, ఆయకట్టులో ఉన్న చివరి ప్రాంతాలైన కుడికాల్వ పరిధిలోని ఇటిక్యాల, మానవపాడు, ఎడమ కాల్వ పరి ధిలోని పెబ్బేరు, వీపనగండ్ల మండలాల పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఫీడర్ చా నెల్స్‌ను పూర్తిస్థాయిలో ఆధునికరించాల్సి ఉంది. ఏటా చివరి ఆయకటుకు నీళ్లందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది.
అ యి తే 1981 నుంచి ఇప్పటివరకు జూరాల ప్రా జెక్టు నిర్మాణం, కాల్వల ఆధునికీకరణ కో సం ప్రభుత్వం రూ.1568 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.495 కోట్లతో రూ. 2063 కో ట్ల అంచనా వ్యయానికి రివైజ్డ్ అంచనాకు అ నుమతి ఇవ్వాల్సిందిగా జూరాల అధికారు లు ప్రభుత్వాన్ని కోరారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వం నిధులి వ్వడం జూరాల ప్రాజెక్టు చరిత్రలో సా ధ్యం కాలే దు. మళ్లీ అరకొర నిధులు కే టాయించడం, పనులు పూర్తి కావడానికి మరికొన్నేళ్ల పాటు కాలయాపన కావడం తప్పదు. బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కు నీటిని అందించే రిజర్వాయర్‌గా ఉన్న జూరాల పనులు ఇప్పట్లో పూర్తయ్యే ప రి స్థితులేవీ కనిపించడం లేదు. ప్రధాన కా ల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫీడర్ చానెల్స్, పి ల్ల కాల్వలు, కాల్వల వెంట రోడ్డు పనుల ను చేపట్టాల్సి ఉంది. అలాగే ఆయకట్టు గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలను కల్పించాలి.
పునరావాస పనులకు ప్రతిపాదనలు
గార్లపాడు-2, నాగర్‌దొడ్డి, ఉప్పేరు-3, అనుగొండ, అంకెన్‌పల్లి కొత్త పునరావాస కేంద్రాల్లో వసతుల కల్పనకు రూ.150 కో ట్లు. ఆయకట్టు పరిధిలో రోడ్ల నిర్మాణాని కి రూ.150 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లు, ఫీల్డ్ ఛానల్స్‌ల ఆధునికీకరణకు రూ.100కోట్లు. జూ రాల ప్రాజెక్టులో మిగిలిపోయిన పనుల కు రూ.95 కోట్లు కావాల్సిందిగా అధికారు లు రివైజ్డ్ అంచనాలు రూపొందించి ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
జూరాల ప్రాజెక్టు వద్ద సౌకర్యాలు కనుమరుగు
జూరాల ప్రాజెక్టు రాష్ట్రంలోనే అతి ఎక్కువ గా 67 క్రస్టుగేట్లతో నిర్మితమైంది. ప్రా జెక్టు సందర్శకులకు కనీసం నిల్వనీడలేని పరి స్థితి నెలకొంది. ప్రాజెక్టు అంచనాలో నే గా ర్డెన్లకు సంబంధించిన ప్రతిపాదన లు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు నిధులు కే టాయించలేదు. గతంలో రూ.11.50 కోట్ల వ్యయంతో గార్డెన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు చేయకుండానే రద్దుచేశా రు. ఆ తర్వాత ఈ పనులను ఉద్యానవన శాఖకు బదిలీ చేసినా ఇప్పటివరకు అ తీ గతి లేదు. పెం డింగ్ పనులను పూర్తిచేసేందుకు సరైన నిధులు కేటాయిస్తేనే ఆ యకట్టు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.