నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాల నాణ్యతను పరిశీలిస్తున్న వర్క్‌ఇన్‌స్పెక్టర్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
చాపాడు(కడప): నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాల నాణ్యతను పరిశీలిస్తున్న వర్క్‌ఇన్‌స్పెక్టర్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం విశ్వనాథపురంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో నూతనంగా ఒక గది నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నారు.
వీటి నాణ్యత పరిశీలించడానికి జిల్లా కేంద్రం నుంచి దేవాదాయ శాఖ వర్క్‌ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డి(36) వచ్చారు. నాణ్యతను పరిశీలిస్తున్న క్రమంలో స్లాబ్‌పై భాగానికి వెళ్లిన ఆయన పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా.. అప్పటికే మృతిచెందాడు.