లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం

లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం - Sakshi


మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ అస్థిపంజరం కలకలం సృష్టించింది. బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల స్వాధీనంలోని ఓ లారీ టూల్ బాక్స్ లోంచి ఈ అస్థి పంజరం బయటపడడంతో సంచలనం కలిగించింది. ఏడేళ్ల క్రితం 2007 జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచారు.ఈ కేసును రెండేళ్ల క్రితం  కోర్టులో కొట్టేశారు. అప్పటి నుంచి చెడిపోయిన లారీకి మరమత్తులు చేయించేందుకు మెకానిక్ను తీసుకుని యజమాని  స్టేషన్ వద్దకు వచ్చి చూడగా లారీలో మహిళ అస్థి పంజరం కనిపించింది. మృతురాలు బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు భావిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top