మహిళ దారుణ హత్య | woman murdered in Choutuppal | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Oct 5 2014 3:32 AM | Updated on Aug 21 2018 5:46 PM

మహిళ దారుణ హత్య - Sakshi

మహిళ దారుణ హత్య

గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగుచూసింది.

చౌటుప్పల్ : గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగుచూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35సంవత్సరాల వయస్సు గల మహిళను దుండగులు వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు పక్కన గల, ఎస్.లింగోటం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చాడు.పత్తిచేలో పెనుగులాట జరిగింది. మొదట గొంతు నులిమి,బండరాయిని తలపై మోది చంపేశాడు.బండరాయిని అలాగే తలపై ఎత్తేసి వెళ్లాడు. రెండు రోజులు సద్దుల బతుకమ్మ, విజయదశమి కావడంతో పత్తిచేను వైపు ఎవరూ వెళ్లలేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. శనివారం ఉదయం అటు వైపు వెళ్లిన పశువుల కాపరి చూసి, పోలీసులకు సమాచారమిచ్చాడు.
 
 పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు  పోలీసులతో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం పోలీసులను రప్పించి, ఆనవాళ్లను సేకరించారు. పోలీస్ డాగ్‌స్క్వాడ్‌ను రప్పించినా ఫలితం లేకపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేశారు. సుమారు 50గంటల క్రితమే చనిపోయినట్టు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న పౌల్ట్రీఫామ్, పరిశ్రమల్లో పనిచేసే మహిళగా భావించి, విచారించినప్పటికీ ఫలితం లేకపోయింది. వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. గత 3రోజుల క్రితం ఎక్కడైనా మహిళ అదృశ్యమైతే, 9440795612నెంబరుకు సంప్రదించాలని పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement