రైలుకింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య | woman commits suicide in yalamanchili | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Mar 12 2014 8:34 AM | Updated on Sep 2 2017 4:38 AM

విశాఖ జిల్లా యలమంచిలి వద్ద ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది.

విశాఖ జిల్లా యలమంచిలి వద్ద ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. వారిలో తల్లి, ఒక కూతురు మరణించగా, మరో కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ తల్లీ కూతుళ్లు ఎవరో, ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారన్న విషయం ఇంకా తెలియరాలేదు. బహుశా కుటుంబలో కలతల వల్ల ఇలా చేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement