భర్తను చంపి.. పొలంలో పాతి.. నాట్లు వేసేశారు! | wife kills husband with son and paramour in chittoor | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. పొలంలో పాతి.. నాట్లు వేసేశారు!

Oct 11 2014 12:04 PM | Updated on Sep 2 2018 4:37 PM

భర్తను చంపి.. పొలంలో పాతి.. నాట్లు వేసేశారు! - Sakshi

భర్తను చంపి.. పొలంలో పాతి.. నాట్లు వేసేశారు!

చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం గోపాలపురంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పాలిట భార్యే మృత్యువుగా మారింది.

(తిరుపతి నుంచి సాక్షి టీవీ రిపోర్టర్ మధు)

చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం గోపాలపురంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త పాలిట భార్యే మృత్యువుగా మారింది. కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య అనంతరం భర్త శవాన్ని పొలంలోనే పాతిపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కేవీ పురానికి చెందిన మునెయ్యకు గోపాలపురానికి చెందిన సుమతితో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

కాగా గోపాలపురానికి చెందిన సెల్వంతో సుమతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దాంతో భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. వారం క్రితం భర్తను హతమార్చి శవాన్ని,  సెల్వం పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం ఎవరూ గుర్తించకుండా పొలంలో వరినాట్లు కూడా వేశారు. అయితే మునెయ్య తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మునెయ్య కుమారుడు బాబును ప్రశ్నించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా శవాన్ని ఈరోజు వెలికి తీయటం సాధ్యం కాదని పోలీసులు తెలపటంతో మృతుడి తరపు బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

murder, wife, husband, paramour, chittoor, హత్య, భార్య, భర్త, ఫిర్యాదు, గోపాలపురం, చిత్తూరు జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement