కావలి కాలువ గురించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. పంటలు ఎండిపోతున్నాయని, కావలి కాలువకు 1,200 క్యూసెక్కుల నీరు ఇచ్చేలా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి సీఎంను డిమాండ్ చేశారు.
కావలి కాలువ గురించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. పంటలు ఎండిపోతున్నాయని, కావలి కాలువకు 1,200 క్యూసెక్కుల నీరు ఇచ్చేలా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి సీఎంను డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలంటే పెండింగ్‌లో ఉన్న పనులకు వెంటనే అటవీ అనుమతులు ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి నడికుడి-శ్రీకాళహస్తి రైల్యే పనులు పూర్తయితే నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని కోరారు. అదేవిధంగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా లైనింగ్ నార్త్ ఫీడర్, సౌత్ ఫీడర్ కెనాల్స్ పూర్తిచేస్తే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని కోరారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఇంకా స్థానికంగా ఉన్న పలు సమస్యలపై సీఎంకు వివరించినట్లు సమాచారం. అంతకు ముందు జిల్లా అధికారయంత్రాంగం పలు కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారులు, ఎమ్మెల్యేలు పలు సమస్యలపై నివేదికలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని అధికారవర్గాలు వెల్లడించాయి. అందరు చెప్పినవి విని పొదుపు మంత్రం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది.