పోలీసులకు వీక్లీ ఆఫ్‌

Weekly Off Announce For Police Department - Sakshi

 విధి విధానాలకు ప్రత్యేక కమిటీ

త్వరలో అమలుకు శ్రీకారం చుట్టాలన్న నూతన సీఎం

పని ఒత్తిడితో అవస్థలు పడుతున్న వారికి ఒకరోజు ఆటవిడుపు

ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్‌ జగన్‌

పోలీసులను పట్టించుకోని టీడీపీ సర్కార్‌

శాంతిభద్రతల పరిరక్షణలో వారిది అలుపెరగని పోరాటం..పండుగ లేదు...పబ్బం లేదు..అనుక్షణం పని ఒత్తిడితో అల్లాడిపోతున్నవారిని పట్టించుకునే వారు లేరు. ఏ క్షణంలోఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో కత్తిమీదసాములా ఉద్యోగం చేస్తున్న వారికి ఒక దివ్యఔషధం అందనుంది. అనుక్షణం పని ఒత్తిడితో..విశ్రాంతి లేని జీవితంతో...కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేని పరిస్థితి.. సొంతపనులు చూసుకోవడానికి వెళ్లాలన్నా తీరికలేక అవస్థలు పడుతున్న పోలీసులకుమంచిరోజులు వచ్చాయి. పోరాటయోధుడుతీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో మార్పుతేనుంది. అంతకుముందున్న టీడీపీ, కాంగ్రెస్‌ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పరిపాలించినా..వీరి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

సాక్షి కడప: చాలా ఏళ్ల తర్వాత పోలీసులకు వారంలో ఒకరోజు తనది అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీరికి వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన త్వరలో అమలు కానుంది.  ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్య తలు తీసుకున్ననాటి నుంచి పేద ప్రజల సంక్షేమం.. ఉద్యోగుల సాదక బాధకాలు..అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం అన్ని శాఖలతో   సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భో జన కార్మికులకు రూ. 1000 నుంచి రూ. 3000, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. పథకాల్లో లొసుగులను ఏరిపారేస్తూ పటిష్టంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న నూతన సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల హామీల అమలు కు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా ప్ర జా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సభల్లో పోలీ సులకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి వారికి వా రంలో ఒకరోజు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో సమీక్షిం చిన సీఎం అమలుకు చర్యలు చేపడుతున్నారు.

విధి విధానాలకు ప్రత్యేక కమిటీ: సీఎం వైఎస్‌ జగన్‌ పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు విధి విధానాలకు కమిటీ వేశారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసేందుకు ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది.చరిత్రలో సీఎం నిర్ణయం సాహాసోపేతం: చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం సాహాసోపేతం. పోలీసు కానిస్టేబుళ్లతోపాటు అధికారులు డ్యూటీకి సంబంధం లేకుండా వారంలో ఒకరోజు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు వారంలో ఒకరోజు కేటాయించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకోనున్న వీక్లీ ఆఫ్‌ నిర్ణయం పోలీసు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top