పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని జేసీ రేఖారాణి అన్నారు.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని జేసీ రేఖారాణి అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం 36వ జేసీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను చాలెంజ్‌గా తీసుకుని సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేస్తానన్నారు.
పౌరసరఫరాశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. అమ్మ హస్తం పథకం పగడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. గ్రీవెన్స్‌డేకు వచ్చే అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది జేసీకి శుభాకాంక్షలు చెప్పారు. జేసీని కలిసిన వారిలో ఏజేసీ రాజ్‌కుమార్, డీఎస్‌ఓ శాంతకుమారి, ఆర్డీఓలు సుబ్రమణ్యేశ్వరరెడ్డి, మధుసూదన్‌రావుతదితరులు ఉన్నారు.