బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.
బంగారంపై కేంద్రం ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకం విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా సుదుంలో ఓ స్కూల్ వార్షికోత్సవానికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని బంగారు వర్తకులు కలసి ఎక్సైజ్ సుంకం ఎత్తివేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే, చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరీపై న్యాయం పోరాటం చేసి తొలగించబడిన కార్మికులకు న్యాయం చేస్తామన్నారు.