
సాక్షి, విశాఖపట్నం : మద్యానికి బానిసైన ఓ పోలీస్ కానిస్టేబుల్, గాంధీ జయంతిన కూడా పీకలదాకా మందుకొట్టి ఆఫీసుకెళ్లాడు. విధిగా చేయాల్సిన రోల్‌కాల్‌లో తడబడుతూ, తూలిపడ్డాడు. ఉన్నతాధికారుల ఎదురుగానే ఇదంతా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలోని పెదగంట్యాడ ఫైర్ స్టేషన్‌లో మంగరాజు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అతను అక్టోబర్ 2న జరిగిన గాంధీ జయంతి వేడుకలకు మత్తులోనే హాజరయ్యాడు. ఉన్నతాధికారుల ముందు రోల్‌కాల్ చేస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగరాజుపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. మంగరాజు మద్యంలో ఊగిపోతూ చేసిన ఫీట్లు పొట్టచెక్కలయ్యేంత నవ్వు పుట్టిస్తాయి...