breaking news
pedagantyada
-
విశాఖలో హై టెన్షన్.. పోలీసులపై తిరగబడ్డ జనం
-
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
మందులో మంగరాజు.. ఏం చేశాడో చూడండి..
సాక్షి, విశాఖపట్నం : మద్యానికి బానిసైన ఓ పోలీస్ కానిస్టేబుల్, గాంధీ జయంతిన కూడా పీకలదాకా మందుకొట్టి ఆఫీసుకెళ్లాడు. విధిగా చేయాల్సిన రోల్‌కాల్‌లో తడబడుతూ, తూలిపడ్డాడు. ఉన్నతాధికారుల ఎదురుగానే ఇదంతా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని పెదగంట్యాడ ఫైర్ స్టేషన్లో మంగరాజు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అతను అక్టోబర్ 2న జరిగిన గాంధీ జయంతి వేడుకలకు మత్తులోనే హాజరయ్యాడు. ఉన్నతాధికారుల ముందు రోల్‌కాల్ చేస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగరాజుపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. మంగరాజు మద్యంలో ఊగిపోతూ చేసిన ఫీట్లు పొట్టచెక్కలయ్యేంత నవ్వు పుట్టిస్తాయి... -
‘వుడా’కు 21.68 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా పెదగంట్యాడలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కు 21.68 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ భూమి ఎకరం విలువ రూ.60 లక్షలుగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే నగరాభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని వుడాకు ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం జీవో జారీ చేశారు. -
బాబు పాలనలో వర్షాలు రావు
-
బాబు పాలనలో వర్షాలు రావు
పెదగంట్యాడ(విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు. బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. -
అక్కాచెల్లెళ్లపై కామాంధుడి అకృత్యం
విశాఖపట్నం: ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న ఓ యువకుడు వికృత రూపమెత్తి మృగాడుగా మారాడు. తనకు బంధువులైన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్కాచెల్లెళ్లైన ఈ బాలికలకు అతను వరుసకు మేనమామ అవుతాడు. న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ జి. శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెదగంట్యాడ మండలం ప్రియదర్శినీ కాలనీకి చెందిన సమ్మిడి రాజేష్ (26) బీటెక్ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాడు. దూరపు బంధువులైన ఒక కుటుంబం రాజేష్ ఇంటి పక్కనే ఉంటోంది. ఆ కుటుంబ యజమాని గల్ఫ్‌లో వెల్డర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య తన ముగ్గురు కుమార్తెలతో ప్రియదర్శినీ కాలనీలో ఉంటోంది. పెద్ద కుమార్తె (13)పై రాజేష్ సుమారు నాలుగు నెలలు క్రితం అత్యాచారం చేశాడు. అనంతరం పలుమార్లు అతడు ఆ బాలికపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అతని చేష్టలకు భయపడిన ఆ బాలిక అతని వద్దకు వెళ్లడం మానేసింది. దీంతో ఆ మృగాడి కన్ను బాధితురాలి చెల్లిపై పడింది. ఈమె(10)పై కూడా రాజేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సీఐ తెలిపారు. రాజేష్ వికృత చేష్టాలతో భీతిల్లిన ఆ బాలికలు అతడిని చూస్తే భయంతో వణికిపోతుండటాన్ని తల్లి గమనించింది. పిల్లలను గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. దీంతో ఆమె సోమవారం రాత్రి న్యూపోర్టు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి మంగళవారం నిందితుణ్ణి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికలను కేజీహెచ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.


