ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు | Uravakonda Auto Drivers Thanks To CM Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ప్రతి హామీని నెరవేరుస్తున్నారు..

Oct 7 2019 2:53 PM | Updated on Oct 7 2019 5:32 PM

Uravakonda Auto Drivers Thanks To CM Jagan - Sakshi

సాక్షి, అనంతపురం: ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని..వారికి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండలో సోమవారం విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్‌కు ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా హామీలను గాలికొదిలేయకుండా ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నాలుగు నెలల్లోనే నెరవేర్చి  వైఎస్‌ జగన్‌ మాట నిలబెట్టుకున్నారన్నారు.


(చదవండి: నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్‌)


 

Advertisement
 
Advertisement
Advertisement