సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలోనే సమైక్య ఉద్యమం నడుస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు.
నర్సాపూర్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలోనే సమైక్య ఉద్యమం నడుస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు, సీమాంధ్ర నాయకులే రాజ్యం నడుపుతున్నారన్నారు. రాష్ర్టంలో తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం, సీమాంధ్ర ప్రజలకు ఒక న్యాయం కొనసాగుతోందన్నారు. తెలంగాణవాదులు దీక్షలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవాలంటే నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయంటూ ఆంక్షలు విధిస్తున్న పోలీసు అధికారులు సీమాంధ్ర నాయకులు సభలు పెట్టుకునేందుకు అన్ని విధాలా సహకరించడం విచారకరమన్నారు.
సకల జనభేరిని విజయవంతం చేయాలి
ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జన భేరిని విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ పిలుపు నిచ్చారు. జిల్లాలోని ప్రతి నియోజక వర్గం నుంచి వెయ్యి మంది కార్యకర్తలు తరలి రావాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మన్నెవీరేశం, దేవేందర్‌రెడ్డి, హబీబ్‌ఖాన్, కుమ్మరి నగేష్, ఖుస్రూ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.