Mar 23 2017 10:52 AM | Updated on Aug 28 2018 5:55 PM
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం
ఓ అజ్ఞాత భక్తుడు తిరుమల శ్రీవారికి పెద్దమొత్తంలో విరాళమిచ్చాడు.
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గురువారం ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. పెరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి శ్రీవారికి రూ. 2 కోట్లు విరాళం అందజేశాడు. ఆ డబ్బును అన్న ప్రసాదానికి వినియోగించాలని కోరాడని ఆలయ అధికారులు తెలిపారు.