చెన్నైలోని కోయంబేడు అంతర్రాష్ట్ర బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన తొమ్మిది బస్సులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
చెన్నైలోని కోయంబేడు అంతర్రాష్ట్ర బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన తొమ్మిది బస్సులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా శేషాచటం అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లయిన 20 మంది తమిళుల ఎన్కౌంటర్కు నిరసనగానే ఈ దాడులు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తిరుపతి డిపోకు చెందిన ఆరు బస్సులు, నెల్లూరు డిపోకు చెందిన మూడు బస్సులు దుండగుల దాడిలో ధ్వంసమయ్యాయి.
శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిచాయి. ఏపీ ఆస్తులు, వాహనాలపై దాడులకు దిగుతామంటూ పలు సంస్థలు హెచ్చరించాయి. దీంతో తమిళనాడుకు బస్సు సర్వీసుల్ని రద్దుచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.