రోడ్డు ప్రమాదంలో మామా అల్లుళ్ల దుర్మరణం | Two women died in Malikipuram | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మామా అల్లుళ్ల దుర్మరణం

Jul 8 2018 6:50 AM | Updated on Jul 8 2018 6:50 AM

Two women died in Malikipuram - Sakshi

మలికిపురం (రాజోలు): మండలంలోని గుడిమెళ్లంక గ్రామంలో ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కటికదల సుబ్రహ్మణ్యం (38), దుండి సురేష్‌(27) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ సొంత మామా అల్లుళ్లు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని సార్వా. మలికిపురంలోని బంధువుల ఇంటికి వీరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వీరు ఎదురుగా వస్తున్న పంగిడికి చెందిన కంకర లారీని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 

మలికిపురంలోని బంధువుల ఇంట్లో సోమవారం ఓ కార్యక్రమం ఉండటంతో ఇప్పటికే సుబ్రహ్మణ్యం కుమార్తె రాణి, చిన్న కుమార్తె సుష్మ మలికిపురం చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం, సురేష్‌ శనివారం మలికిపురం వస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే మలికిపురంలోనే ఉన్న కుమార్తెలు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. ఒకే సారి తండ్రి, భర్తను కోల్పోయిన రాణి, తండ్రిని, బావను కోల్పోయిన సుష్మ విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. రాణికి ఏడాది పాప ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి ఎస్సైలు పవన్‌కుమార్, చైతన్యకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement