నెల్లూరు జిల్లా తడలోని మదీనాకాలనీ వద్ద నీటి గుంటలో రెండు మృతదేహాలు తేలుతుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నెల్లూరు జిల్లా తడలోని మదీనాకాలనీ వద్ద నీటి గుంటలో రెండు మృతదేహాలు తేలుతుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చెన్నై వాసులుగా అనుమానిస్తున్నారు. వారి వద్ద చెన్నై నుంచి 8వ తేది బయలుదేరినట్లు టికెట్లు లభించాయి. స్థానికంగా లభించే నత్తగుల్లల కోసం వచ్చిన వారిగా అనుమానిస్తున్నారు. నత్తగుల్లలు సేకరించే క్రమంలో నీటి గుంటలోకి దిగిన వీరు ప్రమాదవశాత్తు నాచు చుట్టుకొని మృతిచెందనిట్లు తెలుస్తోంది.