అంబులెన్స్ ఢీకొని ఇద్దరి మృతి | two killed in Ambulance accident | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ ఢీకొని ఇద్దరి మృతి

Apr 21 2016 1:09 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట వద్ద గురువారం చోటుచేసుకుంది. మార్కాపురం నుంచి మృతదేహాన్ని తీసుకొని కంభం వెళ్తున్న అంబులెన్స్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్ పై ఉన్న చింతకుంట్ల నాగేష్(24), ప్రశాంత్(22) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement