గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
విజయవాడ: గ్రావెల్ క్వారీలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోపూరులో ఈ విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయారు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృత దేహాలను బయటకు తీశారు. పిల్లల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.