ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు | two ap ministers lucky escapes from road accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు

Sep 22 2014 7:46 PM | Updated on Sep 2 2017 1:48 PM

ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు

ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రాణాపాయం తప్పింది.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రాణాపాయం తప్పింది. మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు.. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు-ఉప్పలపాడు రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మంత్రులు క్షేమంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డంతా బురదగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు బురదగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement