సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌, ఈఓ | TTD Chairman EO Meets AP CM YS Jagan In Thadepalli | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌, ఈఓ

Sep 21 2019 11:34 AM | Updated on Sep 21 2019 11:47 AM

TTD Chairman EO Meets AP CM YS Jagan In Thadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో ఏవీ ధర్మారెడ్డిలు కలిశారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన వారు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆయన్ని ఆహ్వానించారు. ఈ నెల 30నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనుండగా, మొదటిరోజున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించకున్నారు.

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ మరికొద్దిసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన నంద్యాల, మహానందిలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement