కామారెడ్డి ‘ట్రామాకేర్’ ప్రారంభమెన్నడో! | Trauma Care centers in kama reddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డి ‘ట్రామాకేర్’ ప్రారంభమెన్నడో!

Dec 14 2013 4:22 AM | Updated on Sep 2 2017 1:34 AM

జిల్లా మీదుగా పోతున్న నల్లని జాతీయ రహదారులు నిత్యం ఎరుపెక్కుతున్నాయి.

దేవునిపల్లి, న్యూస్‌లైన్ : జిల్లా మీదుగా పోతున్న నల్లని జాతీయ రహదారులు నిత్యం ఎరుపెక్కుతున్నాయి. రోజూ ప్రమాదాలతో రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. సకాలంలో సరైన వైద్యం అందక కొనప్రాణంతో ఉన్నవారు కన్నుమూస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యాధునిక వైద్యసేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో మంజూరు చేసిన ట్రామాకేర్ సెంటర్‌లు జిల్లాలో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన కేం ద్రం పనులు అర్ధంతరంగా నిలిచిపోగా.. ఇక పనుల పూర్తయి రెండున్నరేళ్లు గడుస్తున్న కామారెడ్డి ‘కేర్’సెంటర్‌ను పట్టించుకునే నాథుడే లేరు.
 
 తుప్పుపడుతున్న సామగ్రి..
 కామారెడ్డికి 2008లో మంజూరైన ట్రామాకేర్ సెంటర్ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. 2011 మా ర్చిలో భవన నిర్మాణం పూర్తవ్వడంతో ప్రభుత్వానికి అ ప్పగించారు. ఈ రెండున్నరేళ్లలో వృథాగా పడిఉన్న కో టిన్నర విలువైన సామగ్రి సైతం తుప్పుపట్టింది.  ఇప్ప టి వరకు భవనానికి రూ.65 లక్షలు, సామగ్రికి రూ.కోటి వర కు, అంబులెన్సుకు రూ.30లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.రెండు కోట్ల వరకు నిధులు రావాలి. మరిన్ని అధునాతన యంత్రాలు, వైద్యులు, సిబ్బందిని నియమించా ల్సి ఉంది. ‘అప్పుడు ప్రారంభిస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తాం..’ అంటూ హామీలు ఇస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తూ వస్తున్నారే తప్పా ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపానపోవడం లేదు.
 
 నేడు ఢిల్లీ నుంచి ప్రత్యేకబృందం రాక
 కామారెడ్డిలోని ట్రామా కేర్ సెంటర్‌ను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం అధికారులు రానున్నారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున, డిప్యూటీ కమిషనర్ లోకనాయక్, ప్రభుత్వ పిన్సిపాల్ సెక్రెటరీ అజయ్‌సహాని, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ అనురాగ్ తదితరులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సైతం రానున్నారు. ఢిల్లీ బృందం పరిశీలన తర్వాైతెనా కామారెడ్డి ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement