
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉరకగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన శంకరం పంచాయతీకి చేరుకుని బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు..ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి రేషన్ సరకులు, వైద్య ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో అనకాపల్లి ఆర్డీవో, అధికారులు పాల్గొన్నారు.