ఆంధ్రా ఊటీకి పర్యాటకుల తాకిడి

Tourists Hikes in Borra Caves Visakhapatnam - Sakshi

అరకులోయ: ఆంధ్రా ఊటీగా గుర్తింపు పొందిన అరకులోయ ప్రాంతానికి ఆదివారం పర్యాటకులు తాకిడి పెరిగింది. గతంలో కన్న పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ మధ్యాహ్నం నుంచి పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం,ఘాట్‌లో గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ తోటల ప్రాంతాలలో పర్యాటకులు సందడి చేశారు. వాతావరణం చల్లగా ఉండడంతో పర్యాటకులు అరకు అందాలను చూసి పరవశించారు.   చాపరాయి జలపాతంలో నీటి నిల్వలు తగ్గడంతో పర్యాటకులు నిరుత్సాహపడ్డారు, కొద్దిపాటి జల ప్రవాహంలో స్నానాలు చేశారు.

బొర్రాగుహలలో..
అనంతగిరి (అరకులోయ): ప్రముఖ పర్యాటక కేంద్రమైన  బొర్రాగుహలకు పర్యాటకుల తాకిడి పెద్దగా లేదు. ³ర్యాటక కేంద్రాలు అయిన తాటిగుడ, కటికి జలపాతాలు, కాఫీ ప్లాంటేషన్, డముకు వ్యూ–పాయింట్‌ వద్ద  ఆదివారం ఇదే పరిస్ధితి. దీంతో ఆదివారం సుమారు 1900 మంది పర్యాటకులు మాత్రమే బొర్రాగుహలను తిలకించారని,   రూ. 1.30 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top