
నేటి పరామర్శ యాత్ర షెడ్యూల్
పరామర్శ యాత్ర రెండోరోజు బుధవారం జిల్లాలో కొనసాగుతుంది.
భువనగిరి : పరామర్శ యాత్ర రెండోరోజు బుధవారం జిల్లాలో కొనసాగుతుంది.
ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఉదయం ఆలేరు మండలంలోని శారాజిపేటలో గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపి గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో పున్న వీరయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
కట్టంగూర్ మండల కేంద్రంలోని గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
నకిరేకల్ మండలంలోని మర్రూరు గ్రామంలో పుట్ట సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు.