ఈనాటి ముఖ్యాంశాలు

Today news updates 17th July ICJ asks Pak to review death of Kulbhushan Jadhav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తమకు సవరించిన ప్రతిపాదనలు అందలేదని పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్‌ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ చేజారినప్పటికీ కివీస్‌ కెప్టెన్‌ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. 

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top