పొగాకు రైతు ఆత్మహత్య | tobacco farmer suicide in prakasam district | Sakshi
Sakshi News home page

పొగాకు రైతు ఆత్మహత్య

Sep 11 2015 11:24 AM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొడవారిపాలెంలో పొగాకు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ప్రకాశం: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొడవారిపాలెంలో పొగాకు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లినేని కృష్ణారావు(40) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్థాపం చెందిన కృష్ణారావు మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా రైతుల పట్ల పొగాకు బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆందోళన చేపట్టారు. కృష్ణారావు మృతదేహంతో ఓంగోలు పొగాకు ఆర్ఎమ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement