బాబు వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: తులసిరెడ్డి | thulasi reddy fires on cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

బాబు వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: తులసిరెడ్డి

Jun 5 2015 1:14 PM | Updated on Aug 18 2018 6:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలన్నీ సమైక్య రాష్ట్రంలోనే ఇచ్చామనటం పచ్చి అబద్ధమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలన్నీ సమైక్య రాష్ట్రంలోనే ఇచ్చామనటం పచ్చి అబద్ధమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియ ముగిసిన నెల రోజుల్లోపే తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా మేనిఫెస్టోలను విడుదల చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత.. ఇప్పుడు హామాలను అమలు చేయటంలో చేతులు ఎత్తేయటం చంద్రబాబు పచ్చి మోసానికి నిదర్శనమని తులసిరెడ్డి విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement