నీట మునిగి ముగ్గురు చిన్నారుల గల్లంతు | three missing in water lake | Sakshi
Sakshi News home page

నీట మునిగి ముగ్గురు చిన్నారుల గల్లంతు

Jun 13 2015 4:42 PM | Updated on Aug 28 2018 7:15 PM

విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం చీడిపుట్ట వంతెన సమీపంలోని వాగు (గెడ్డ)లో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

హుకుంపేట: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం చీడిపుట్ట వంతెన సమీపంలోని వాగు (గెడ్డ)లో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్లలోపు వయసున్న ముగ్గురు బాలురు వాగులో స్నానం కోసం దిగి గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో జగదీశ్వరరావు అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement